కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు

కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు

కరోనా వైరస్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న డజన్లమందిని న్యూజిలాండ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరంతా మూడ్రోజులుగా న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ సమీపంలో క్యాంపులు వేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌ సమీపం నుంచి వీరిని పంపించాలని పార్లమెంట్‌ స్పీకర్‌ ట్రెవర్‌ మలార్డ్‌ ఆదేశించడంతో పోలీసులు దాదాపు 120 మందిని అరెస్టు చేశారు. కెనెడాలో జరుగుతున్న నిరసనలతో స్ఫూర్తి పొందిన దాదాపు వెయ్యిమంది నిరసనకారులు పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు.

యూరప్‌లోని పలు దేశాల్లో సైతం కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు ఆరంభమయ్యాయి. శుక్రవారం నుంచి సోమవారం వరకు పారిస్‌ నగరాన్ని దిగ్భంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. దీంతో నగరంలో ఎక్కడా ప్రజాజీవనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిషేధాజ్ఞలు విధించారు. బెల్జియంలో కూడా ట్రక్కర్లు రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. వియన్నాలో కూడా నిరసనకారులు ర్యాలీకి పిలుపునిచ్చారు. స్పెయిన్‌లో టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌పై నిరసనకారులు ధర్నాలకు పిలుపునిచ్చారు.