వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్..

newzeland won the toss and elected to bat

లండన్: మాంచెస్టర్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఇవాళ తలపడనుంది. ఈ క్రమంలో రెండు జట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

భారత్: లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా.

న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్‌టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషం, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ శాన్టనర్, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.