నెక్స్ట్ ఏంటి మూవీ టీజర్: కలర్ ఫుల్ గా ఉంది

next enti movie teaser

నెక్స్ట్ ఏంటి – ఈ సినిమా కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకి హిందీ లో హమ్ తుమ్, ఫనా వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ కునాల్ కోహ్లీ తొలిసారిగా తెలుగు లో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెక్స్ట్ ఏంటి సినిమా హమ్ తుమ్ సినిమాకి తెలుగు రీమేక్. ఈ సినిమాలో సందీప్ కిషన్ మరియు తమన్నా జంటగా నటిస్తున్నారు. అంతేకాకుండా నవదీప్ మరియు పూనమ్ కౌర్ మరో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

ఈరోజే ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. చూడగానే కలర్ ఫుల్ గా ఉన్న ఈ సినిమా బాలీవుడ్ సినిమాలని తలపిస్తుందే తప్ప తెలుగు నేటివిటీ ని కనిపించనీయలేదు. అందులోనూ డైరెక్టర్ కూడా బాలీవుడ్ మరియు సినిమా కూడా బాలీవుడ్ సినిమాకి రీమేక్ కాబట్టి ఒక హిందీ సినిమా టీజర్ ని చూస్తున్నట్టే ఉంది. సంగీతం కూడా హిందీ డబ్బింగ్ సాంగ్స్ లాగానే ఉన్నాయి. సందీప్ కిషన్ ఈ సినిమాలో ప్లేబాయ్ గా నటిస్తుండగా, తమన్నా ఎప్పుడూ కనిపించే రొటీన్ లుక్ లోనే కనిపించింది. కానీ, సందీప్ కిషన్ – తమన్నా జంట చూడటానికి చాలా బాగుందని టీజర్ చూడగానే అనిపిస్తుంది. హిందీలో ఘనవిజయం సాధించిన హమ్ తుమ్ సినిమాని తెలుగులో చూడాలనుకుంటున్న వారికి ఈ నెక్స్ట్ ఏంటి సినిమా మంచి వార్త.