‘నెక్ట్స్‌ నువ్వే’ ప్రివ్యూ

Next Nuvve Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   ఆది, రష్మి, బ్రహ్మాజీ, వైభవి 

నిర్మాత  :  బన్నీ వాసు 
దర్శకత్వం :  ప్రభాకర్ 

మ్యూజిక్ డైరెక్టర్ :  సాయికార్తీక్    

సాయి కుమార్‌ నట వారసుడిగా తెరంగేట్రం చేసిన ఆది ‘ప్రేమకావాలి’ మరియు ‘లవ్లీ’ చిత్రాలతో మినహా పెద్దగా సక్సెస్‌ను సాధించలేదు. సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ఆది ఈ చిత్రాన్ని చాలా నమ్మకంతో చేశాడు. బుల్లి తెరపై మెగాస్టార్‌ అంటూ పేరు సంపాదించిన ప్రభాకర్‌ ఈ చిత్రంకు దర్శకత్వం వహించాడు. బుల్లి తెరపై నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటిన ప్రభాకర్‌ ఈ చిత్రంతో వెండి తెరపై కూడా తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హర్రర్‌ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. దానికి తోడు ఈ సినిమాను గీతాఆర్ట్స్‌లో బన్నీ వాసు నిర్మించడంతో సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అల్లు అరవింద్‌ మెచ్చిన కథ అవ్వడంతో ఖచ్చితంగా సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అందుకే భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆదికి జోడీగా వైభవి శాండిల్య హీరోయిన్‌గా నటించింది. జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడం కూడా సినిమాకు ప్లస్‌ పాయింట్‌ కానుంది. ఆది ఈ చిత్రంతో హిట్‌ కొట్టడం గ్యారెంటీ అంటూ కొందరు నమ్మకంతో చెబుతున్నారు. ఈనెల 3న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం సక్సెస్‌ అయితే ప్రభాకర్‌కు దర్శకుడిగా వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.