హీరోయిన్స్ కన్నా తక్కువేమి కాదంటూ ?రెచ్చిపోయిన రీతూ చౌదరి!

Ritu Chowdhury said that she is no less than heroines!
Ritu Chowdhury

తెలుగు పరిశ్రమలో సరైన అవకాశం రావాలే కానీ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎంతో మంది ముద్దుగుమ్మలు రెడీగా ఉన్నారు. ఇప్పటి జెనరేషన్‌లో తెలుగమ్మాయిలకు మేకర్స్ ఆఫర్స్ ఇవ్వడం లేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది. శ్రీవిద్య, మాధవీ లత,అంజలి, బిందు మాధవి, ప్రియాంక జవాల్కర్.. ఇలా చెప్పాలంటే ఠక్కున ఓ పది మంది హీరోయిన్ల పేర్లు కూడా గుర్తుకురావు. ఇటీవల తెలుగు మూలాలున్న శ్రీలీల మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారింది. ఇప్పుడు ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య వంతు వచ్చింది.

అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్, దీపిక పిల్లి , విష్ణు ప్రియ వంటి కొందరు వెండితెర మీద కూడా మెరిశారు. కథానాయికలకు ఏమాత్రం తీసిపోని అందం, అభినయం ఉన్న భామల్లో యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు పాపులర్ షోలలో కనిపించి ఆకట్టుకుంది. అమ్మడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ అన్నిటినీ షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. రీతూ పోస్ట్ చేసే వీడియోలకి , పిక్స్ లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నవీడియోలు , ఫోటోలు వదిలిందంటే సామాజిక మాధ్యమాలలో సెగల పొగలు రేగాల్సిందే.

ఇతర భాషల నుండి దిగుమతయ్యే కథానాయికలకు గట్టి పోటీనిచ్చే బ్యూటీ రీతూ చౌదరి. చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుంది. చూడగానే ఆకట్టుకునే రూపం తన సొంతం. మంచి పర్ఫార్మర్ కూడా. తనను సరిగా గుర్తించడం లేదు అనేది అభిమానుల నిరాశ. ‘నీకు సినిమాలే కరెక్ట్. సాలిడ్ సినిమా పడితే బ్రేక్ వస్తుంది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రీతూకి ఆఫర్స్ ఇవ్వండి.