‘గరుడవేగ’ ప్రివ్యూ…

PSV Garuda vega movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    రాజశేఖర్, సన్నీలియోన్ ,పూజా  కుమార్ ,శ్రద్ధాదాస్ ,కిషోర్ 

నిర్మాతలు  :  కోటేశ్వర రాజు , మురళి శ్రీనివాస్ 
దర్శకత్వం :  ప్రవీణ్  సత్తార్ 

మ్యూజిక్ డైరెక్టర్ :  శ్రీ చరణ్  పాకల

సినిమాటోగ్రఫీ :  అంజి 

ఎడిటర్ :  ధర్మేంద్ర  కాకరాల 

యాంగ్రీయంగ్‌ మన్‌ రాజశేఖర్‌, పూజా కుమార్‌ జంటగా జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గరుడవేగ’. ఈ చిత్రాన్ని మొదట 10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించాలని భావించినా కూడా కథపై నమ్మకంతో పాటు, దర్శకుడిపై విశ్వాసంతో ఏకంగా 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా జీవిత చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే చాలా అరుదైన లొకేషన్స్‌లలో షూటింగ్‌ జరపడం జరిగింది. గత దశాబ్ద కాలంగా పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేక పోయిన రాజశేఖర్‌ ఈ చిత్రంతో హీరోగా మళ్లీ నిలదొక్కుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 

ట్రైలర్‌ మరియు టీజర్‌లు చాలా విభిన్నంగా ఉండి అసలు సినిమాలో ఏముంది అనే ఆసక్తిని ప్రేక్షకులకు కలిగిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కొన్ని అడ్వంచర్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. గతంలో వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా కూడా రాజశేఖర్‌పై ప్రేక్షకుల్లో ఏదో ఒక మూల నమ్మకం ఉంది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాకు నమ్మకంతో కొనుగోలు చేశారు. సినిమా సక్సెస్‌ అవ్వకుంటే భారీ నష్టాలు తప్పవు. 

ఇప్పటికే 200 కోట్ల మేరకు నష్టపోయామని రాజశేఖర్‌ చెప్పిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కూడా నష్టపోతే రాజశేఖర్‌ ఫ్యామిలీ మరింతగా కష్టాలను ఎదుర్కోవాల్సిందే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రం రాజశేఖర్‌ కెరీర్‌కు బూస్ట్‌ అవుతుందా, మళ్లీ రాజశేఖర్‌ టాలీవుడ్‌లో సత్తా చాటుతాడా అనేది చూడాలి. ఈ చిత్రం ఈనెల 3వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.