సన్నీలియోన్‌ వల్ల కలిసి వచ్చింది

reason behind hero rajashekar PSV garuda vega movie success

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజశేఖర్‌, పూజా కుమార్‌ జంటగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో జీవిత నిర్మించిన చిత్రం ‘గరుడవేగ’. ఈ చిత్రంకు 25 కోట్ల బడ్జెట్‌ పెట్టడంను అంతా తప్పుబట్టారు. రాజశేఖర్‌ సినిమాకు ఎవరైనా అంత బడ్జెట్‌ పెడతారా, అందులో కనీసం సగం అయినా బడ్జెట్‌ రికవరీ అవుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తానికి రాజశేఖర్‌ చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. పెట్టిన పెట్టుబడిని రాబట్టడమే కాకుండా లాభాలను కూడా దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ సక్సెస్‌కు కారణం సన్నీలియోన్‌ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

sunny leone psv garuda vega

‘గరుడవేగ’ చిత్రం ప్రమోషన్‌ మొత్తంను సన్నీలియోన్‌ను చూపించి చేస్తున్నాయి. డియో డియో సాంగ్‌లో సన్నీలియోన్‌ అందాల ఆరబోతను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారు. మాస్‌ ఆడియన్స్‌ దృష్టి ఆకర్షించడంతో పాటు సినిమాలో మ్యాటర్‌ ఉన్న కారణంగా ప్రేక్షకులు సినిమాకు క్యూ కడుతున్నారు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రంలో సన్నీలియోన్‌ నటించినందుకు తీసుకున్న పారితోషికం 60 లక్షలు. ఆమె తీసుకున్న పారితోషికానికి పది రెట్ల లాభం ఆమె వల్ల దక్కిందని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆఫ్‌ ది రికార్డు ఒప్పుకుంటున్నారు.

psv-garuda-vega

సన్నీలియోన్‌ను తీసుకు రావాలనే ఆలోచన చేసిన ప్రవీణ్‌ సత్తారును నిర్మాత జీవిత మరియు హీరో రాజశేఖర్‌లు అభినందిస్తున్నారు. సన్నీలియోన్‌ వల్ల సినిమాకు క్రేజ్‌ రావడం, ఆ క్రేజ్‌తో మంచి ఓపెనింగ్స్‌ దక్కడం, దాని ద్వారా మంచి టాక్‌ రావడం వల్ల ఇప్పుడు అనుకున్న స్థాయి కంటే డబుల్‌ కలెక్షన్స్‌ వస్తున్నాయి. ప్రతి ఏరియాలో కూడా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలను దక్కించుకుంటున్నారు.