అఖిల్‌ కోసం ‘హలో’ చెప్పబోతున్న నాగ్‌…

Nagarjuna gives voice over for Akhil Hello Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘హలో’ చిత్రం వచ్చే నెలలో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వయంగా నాగార్జున నిర్మిస్తున్నాడు. పలు విభిన్న చిత్రాలను తెరకెక్కించి తెలుగు మరియు తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘హలో’ చిత్రం కోసం నాగార్జున తన వాయిస్‌ను కూడా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

akhil-Hello-movie-first-loo

సినీ వర్గాల నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం సినిమాలో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు ఆరంభంలో కథను పరిచయం చేసేందుకు నాగార్జున వాయిస్‌ను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. మొదట ‘హలో’ చిత్రంలో నాగార్జునను చూపించాలని అనుకున్నారు. కాని కథలో మార్పులు చేయడంతో పాటు, పాత్రను ఇరికించినట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో నాగార్జున గెస్ట్‌ రోల్‌ ఆలోచన విరమించుకుని వాయిస్‌ ఓవర్‌కు సిద్దం అయ్యారు. కథను ప్రేక్షకులకు పరిచయం చేయడం, ప్రధాన పాత్రలను పరిచయం చేయడం సినిమాకు చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ చిత్రంలో నాగార్జున ‘హలో’ అంటూ తన వాయిస్‌ ఓవర్‌ను ప్రారంభించి హీరో, హీరోయిన్‌ ఇతర పాత్రలను పరిచయం చేస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

king-nagarjuna-voice-over-f

నాగార్జున వాయిస్‌తో సినిమాకు ఏమైనా కలిసి వస్తుందా అనేది చూడాలి. మొదటి సినిమా ‘అఖిల్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ ఈ చిత్రంపై అంచనాలు చాలా పెట్టుకున్నారు. నాగార్జున కూడా పనులన్ని మానేసి ఈ సినిమాపై ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడు. క్రిస్మస్‌కు పోటీ లేకుండా విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుంది. అఖిల్‌కు ఈ సినిమా సక్సెస్‌ అయితేనే కెరీర్‌లో ముందుకు అడుగు వేయగలడు. కళ్యాణ్‌ ప్రియదర్శిన్‌ హీరోయిన్‌గా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.