నిహారిక వెడ్డింగ్‌ పూర్తి

niharika happy wedding shooting compleated
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా వారసురాలు నిహారిక తెలుగులో ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె తర్వాత సినిమాను విడుదల చేసింది లేదు. ఎట్టకేలకు నిహారిక తెలుగులో ఒక చిత్రాన్ని పూర్తి చేసింది. ఇటీవలే ‘హ్యాపీ వెడ్డింగ్‌’ టైటిల్‌తో నిహారిక ఒక చిత్రాన్ని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతుంది. నిహారిక ఇటీవల తమిళంలో ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని తెలుగులో ఆ సినిమాను డబ్‌ చేయలేదు. మెగా ఫ్యాన్స్‌కు అది తీవ్రంగా నిరాశ పర్చింది. అయితే తాజాగా ‘హ్యాపీ వెడ్డింగ్‌’ చిత్రం రాబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో యువ దర్శకుడు లక్ష్మణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా సుమంత్‌ అశ్విన్‌ నటిస్తున్నాడు. నిహారిక, సుమంత్‌ అశ్విన్‌ల కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొదటి సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయిన నిహారిక ఈ చిత్రంతో అయినా హీరోయిన్‌గా పేరు సంపాదిస్తుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నామని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంకు మంచి ప్రమోషన్‌ చేయడంతో పాటు, ఎక్కువ థియేటర్లలో విడుదల చేసే అవకాశాలున్నాయి.