ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న నిర్భయ తల్లి

ఎట్టకేలకు న్యాయం జరిగిందన్న నిర్భయ తల్లి

ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు నిర్భ‌య దోషులు న‌లుగురు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ లేదు. చివరికి భారత సర్వోన్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నిర్భ‌య దోషులు న‌లుగురు వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

2012 లో జరిగిన నిర్భయ అత్యాచారం కేసులో ఇప్పటికి నిందితులకు శిక్ష విధించారు.నిర్భయ దోషులకు ఉదయం 5;30 నిమిషాలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష ను అమలు చేసారు. నలుగురు దోషులకు ఒకేసారి తీహార్ లోని మూడో నెంబర్ జైల్లో శిక్ష విధించారు. ఇలా నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయడం ఇదే చరిత్రలో తొలిసారి.

ఐతే నలుగురు దోషుల మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు గాను ఎవరూ కుటుంబ సభ్యులు రాలేదు.ప్రస్తుతం వారి మృతదేహాలకు శవ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇది పూర్తి అయిన తర్వాత ఎవరైనా వస్తే వారి మృతదేహాలు అప్పగిస్తారు. లేకపోతే మాత్రం అధికారులే వారి వారి మతాల ఆధారంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. నలుగురు హిందువులు కాబట్టి హైందవ సాంప్రదాయం ప్రకారం వారిని ఖననం చేయనున్నారు అధికారులు. వారిని ఉరి తీయడం తో దేశం మొత్తం హర్షం వ్యక్తమవుతుంది. నిర్భయ తల్లి ఆశా దేవి, మీడియా తో మాట్లాడుతూ తన కూతురుకి ఇన్నాళ్ళకు న్యాయం జరిగిందని అన్నారు. ఇక సామాజిక కార్యకర్తలు అందరూ కూడా… తీహార్ జైలు వద్దకు చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు.