మరో సినిమా ప్రకటించిన నితిన్…రంగ్ దే

Nithin announces another movie

అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. గట్టిగా తోస్తే గేటు కూడా అంతే బలంగా వెనక్కి వస్తుందని, ఇప్పుడు అదే నిజమని ప్రూవ్ చేస్తున్నారు హీరో నితిన్. శ్రీనివాస కళ్యాణం భారీ డిజాస్టర్ కావడంతో ఒక ఏడాది పాటు కనపడకుండా పోయిన నితిన్ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పేసుకుని ప్రరంభోత్సవాలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన నటిస్తున్న భీష్మ సినిమా సెట్స్ మీద ఉంది. నిన్నటికి నిన్న చంద్రశేఖర్ యేలేటి సినిమాకి కొబ్బరి కాయ కొట్టాడు, ఇక ఈరోజు ఉదయమే మళ్ళీ మరో సినిమాకి సంబందించిన అప్డేట్ ఇచ్చి అభిమానులని ఖుషీ చేశాడు. తొలి ప్రేమ‌ సినిమాతో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. రెండో సినిమా అఖిల్‌తో మ‌జ్ను చేసి దెబ్బ తిన్నాడు. ఇక దీంతో మూడో సినిమా నితిన్ తో ఓకే చేయించుకున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుందట.  ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుందని, ఈ సినిమాకు రంగ్‌దే అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు ప్రకటించారు నితిన్. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రఫర్‌గా పీసీ శ్రీరామ్‌ పనిచేయనున్నారని వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ చేయనున్నామని ఆయన ప్రకటించారు.