మాస్‌ దర్శకుడిపై నమ్మకం పెట్టుకున్న నితిన్‌…

Nithin next movie with Anil Ravipudi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యువ హీరో నితిన్‌ ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన ‘లై’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం డిజాస్టర్‌ అవ్వడంతో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల పాలు అయ్యారు. నితిన్‌ కెరీర్‌లో కూడా ఆ సినిమా చేదు అనుభవంను మిగిల్చింది. ‘అఆ’ తర్వాత ఆ విజయాన్ని కొనసాగించడంలో నితిన్‌ ఫ్లాప్‌ అయ్యాడు. ఇక ప్రస్తుతం నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాకు త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌లు నిర్మాతలు అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘లై’ ఫలితంతో సంబంధం లేకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమాపై నితిన్‌ పూర్తి ఫోకస్‌ను పెట్టాడు. త్వరలోనే నితిన్‌ ఆ సినిమాను పూర్తి చేయబోతున్నాడు.

కృష్ణ చైతన్యతో సినిమా క్లాస్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నితిన్‌ తన తర్వాత సినిమాను పూర్తి మాస్‌ మసాలా చిత్రంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడు. వరుసగా మాస్‌ మూడు మాస్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్‌ను దక్కించుకున్న అనీల్‌ రావిపూడి త్వరలో నితిన్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నాడు. ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలతో అనీల్‌ రావిపూడి స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈయనతో సినిమాలు చేసేందుకు యువ హీరోలు మరియు పెద్ద హీరోలు కూడా ఆసక్తిగా ఉన్నారు.

ఈ దర్శకుడు మాత్రం తాజాగా నితిన్‌కు ఒక కథ వినిపించడం ఆ కథకు నితిన్‌ ఓకే చెప్పడం జరిగి పోయింది. వచ్చే సంవత్సరం ఆరంభంలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్న రాధాకృష్ణ అనే నిర్మాత వీరి కాంబో మూవీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈయన నితిన్‌ డేట్లను తీసుకోవడంతో పాటు దర్శకుడితో స్క్రిప్ట్‌ను రెడీ చేయించే పనిలో ఉన్నాడు. నితిన్‌ ఇప్పటి వరకు పూర్తి స్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌తో సక్సెస్‌ను దక్కించుకున్నది లేదు. మరి ఈసారి అయినా మాస్‌ సక్సెస్‌ను నితిన్‌ దక్కించుకుంటాడేమో చూడాలి.