‘నిజం’ కాన్సెప్ట్‌తో బెల్లంకొండ మూవీ…!

Nizam Movie Seqal On Bellamkonda Srinivas

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. కాజల్‌, మెహ్రీన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం అవినీతిపై ఒక యువకుడు చేసే పోరాటం కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతుంది. నిజం చిత్రంలో మహేష్‌బాబును విభిన్నంగా చూపించి అందరి దృష్టిని ఆకర్షించిన తేజ ప్రస్తుతం బెల్లంకొండను కూడా నిజంలో మహేష్‌బాబుగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో బెల్లంకొండతో పాటు కాజల్‌కు సమానమైన ప్రాత్రను చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

kajal-bellam

‘నిజం’ చిత్రంలో హీరో పాత్రకు తల్లి అండదండగా నిలుస్తూ అవినీతిపై పోరాటం సాగించేందుకు తోడ్పాటును అందిస్తుంది. ఈ చిత్రంలో మాత్రం హీరోతో పాటు హీరోయిన్‌ కలిసి అవినీతి పోరాటంను సాగిస్తూ ఉంది. జులాయిగా తిరిగే హీరోను సరైన మార్గంలో నడిచేలా చేసి, పదిమందికి ఉపయోగపడే పనులు చేసేలా హీరోయిన్‌ ప్రేరేపిస్తుంది. అలా హీరోయిన్‌, హీరో మద్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ గత చిత్రం ‘సాక్ష్యం’ నిరాశ పర్చిన నేపథ్యంలో ఈ చిత్రం అయినా సక్సెస్‌ను దక్కించుకుంటుందో లేదో చూడాలి.

nizam-kajal