హైదరాబాద్ సదస్సుకు వస్తామన్నా వద్దన్నారు.

No Entry For AP Govt in Global Entrepreneurship Summit in Hyderabad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడులు సాధించడానికి సీఎం చంద్రబాబు వేట సాగుతూనే వుంది. ఈ వేటలో ఇటీవల ఓ బాణం గురి తప్పింది. అందులో ప్రధాని మోడీ హస్తం ఉందోలేదో కానీ కేంద్రం కొర్రీ వుంది.

Chandrababu-Naidu-ap

హైదరాబాద్ లో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్ ( జీ.ఈ .ఎస్ ) లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఇందులో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాణిజ్యవేత్తలను ఆకట్టుకునే అవకాశం ఉంటుందని భావించింది. అయితే కేంద్రం నుంచి ఈ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వానం ఏదీ రాకపోవడంతో ఏపీ ఎకనామిక్ బోర్డు తానే చొరవ తీసుకుంది.

Global-Entrepreneurship-Sum

హైదరాబాద్ సమ్మిట్ లో పాల్గోడానికి ఆసక్తిగా ఉన్నామని కేంద్రానికి ఓ లేఖ రాసింది. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు సరి కదా …ఈ సమావేశంతో రాష్ట్రాలకు ఏ సంబంధం లేదని చెప్పేసింది. భారత్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ ను వేదికగా చేసుకున్నాము తప్ప ఇందులో స్థానిక ప్రభుత్వాలకు ఏ పాత్ర లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా ఆహ్వానాలు లేవని తెలిపింది. మొత్తానికి ఏపీ సర్కార్ ప్రతినిధులు హైదరాబాద్ వద్దామన్నా రాలేకపోయారు

Chandrababu-Naidu