ఇకనుండి కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగబోవు

ఇకనుండి కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగబోవు
కామన్వెల్త్‌ గేమ్స్‌ను శాశ్వతంగా బాయ్‌కాట్‌ చేయాలని సంచలన వాక్యలు క్రీడావర్గాల్లో చర్చనీయంగా మారింది.ప్రస్తుతం భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడుగా ఉన్న నరీందర్‌ బాత్రా ఓ కార్యక్రమంలో కామన్వెల్త్‌ గేమ్స్‌ గురించి మాట్లాడారు. పోటీ స్థాయి తక్కువ కామన్వెల్త్‌ గేమ్స్‌ను  శాశ్వతంగా పక్కనబెట్టాలి అని చెప్పిన మాటలు అందరినీ కలవరపెట్టేలా చేశాయి. ఆ క్రీడలలో పోటీ ఎక్కువగా ఉండదని చెప్పారు.
కాబట్టి శాశ్వతంగా కామన్వెల్త్‌ గేమ్స్‌ని పక్కన పెట్టాలి అని అన్నారు. ఎన్నో పతకాలను తెచ్చిపెట్టే అవకాశం ఉన్న షూటింగ్‌ను ఈవెంట్‌ నుంచి తప్పించారు. కాబట్టి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనకుండా చేయాలని చెప్పారు
కానీ నరీందర్‌ బాత్రా కామన్వెల్త్‌ గేమ్స్‌పై చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాలు తీవ్రంగా మండిపడెల చేశాయి. సీడబ్ల్యూజీ వర్గాలు ఇంకా క్రీడాశాఖ ఇప్పటి వరకి ఏమి స్పందించలేదు.అథ్లెట్ల కఠోర శ్రమను ఇది వృధా చేస్తుందని  బాక్సింగ్‌ స్టార్‌ విజేందర్‌ అన్నారు. షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ హాస్యం తెప్పించేలా ఈ వాక్యలు ఉన్నాయి అన్నాడు. టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సత్యన్‌  ఈ వ్యాఖ్యలు దీన్ని అంగీకరించలేమని, సరికాదని అన్నాడు.
 అథ్లెట్‌ కృష్ణ పూనియా కామన్వెల్త్‌ గేమ్స్‌  స్వర్ణ విజేత  మాట్లాడుతూ  పోటీ స్థాయి కామన్వెల్త్‌ గేమ్స్‌లోనే ఆసియా క్రీడల కంటే ఎక్కువ ఉంటుంది అని తన అభిప్రాయాన్ని తెలియచేసింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ బాయ్‌కాట్‌ని ఒప్పుకోకూడదు అని వెయిట్‌లిఫ్టర్‌ సతీశ్‌ శివలింగం చెప్పారు.వీరే కాకుండా కొందరు  హాకీ ఆటగాళ్లు కూడా బాత్రా వ్యాఖ్యలు సరికాదని అన్నారు.