త్వరలో రానున్న నోకియా స్మార్ట్ టీవిలు

త్వరలో రానున్న నోకియా స్మార్ట్ టీవిలు

కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా నోకియా టీవీలు కూడా లాంచ్ చేయబోతుంది. ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకొనగా దీనికి సంబంధించిన వివరాలను ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఈ టీవీలు మన దేశంలోనే తయారు అవుతుండగ పంపిణీ, అమ్మకాల ప్రక్రియలో కొన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

భారత దేశ టీవీ రంగంలో జేబీఎల్ కూడా మొదటిసారి అడుగు పెట్టబోతుంది. జేబీఎల్ సౌండ్ సిస్టంని అత్యాధునిక సౌండ్ నాణ్యత కోసం ఉపయోగించనున్నారు. ఈ టీవీలను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకు రానున్నారు. వాటి ధర ఎంత అనే విషయాలను ఫ్లిప్ కార్ట్ తెలపకపోగా మెట్రో నగరాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆన్ లైన్ షాపింగ్ తో ఉన్న లాభాలని దృష్టిలో పెట్టుకుని కష్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా టీవీలను అందిస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

దేశంలోనే ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ అయిన ఫ్లిప్కార్ట్ తో కలవడం ఆనందంగా ఉందని నోకియా భాగస్వామ్య ప్రతినిధి తెలిపారు. ఫ్లిప్కార్ట్ సహకారంతో నోకియా స్మార్ట్ టీవీలను ఎక్కువ మందికి చేరేలా చేస్తామని చెప్పారు.