విజయ్ దేవరకొండ ‘నోటా’ ట్రైలర్…అరాచకమే !

NOTA Telugu Movie Official Trailer

అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదలయ్యింది. నోటా సినిమాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. నిన్నే టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేయగా ఇప్పుడు విడుదలయిన ట్రైలర్ ఇప్పుడు మరింత ఉత్కంట రేపుతోంది. ఆ ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి మరి