అడిగారు, కాని అర్హత లేదన్నాను

Ntr Character Not Suitable In Mahanati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి జీవిత చరిత్ర కథాంశంగా తెరకెక్కిన ‘మహానటి’ విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా నిన్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులపై, సావిత్రి గారిపై ఎన్టీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సమయంలోనే మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘మహానటి’ చిత్రం చేస్తారు అనగానే నాకు ఆనందం వేసింది. అయితే ఆ చిత్రంలో తాతగారు ఎన్టీఆర్‌ పాత్రను నేను చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో నిర్మాత స్వప్న నా వద్దకు వచ్చారు. ఆమె నా వద్దకు వచ్చిన విషయం నాకు అర్థం అయ్యింది. కాని తాను సున్నితంగా తిరష్కరించాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ ఇంకా మాట్లాడుతూ మహానటి చిత్రంలో ఎన్టీఆర్‌ గారి పాత్ర పోషించాలని నా ముందుకు వచ్చినప్పుడు వెంటనే నేను అందుకు అర్హుడిని కాదు అంటూ చెప్పేశాను. ఆయన పాత్రను పోషించడం ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని, ఆయన స్థాయికి తగ్గట్లుగా తాను నటించలేను అంటూ చెప్పాను అన్నాడు. అయితే ఎన్టీఆర్‌ ‘మహానటి’ చిత్రంలో ఉన్నట్లయితే నేడు ఆ సినిమా స్థాయి అమాంతం రెట్టింపు అయ్యేది అనే మాట వాస్తవం. ఎన్టీఆర్‌ ఎందుకు తాతగారి పాత్రను చేసేందుకు నిరాకరించాడు అనే విషయం మాత్రం అర్థం అవ్వడం లేదు. ఎన్టీఆర్‌ పాత్రను చేసేందుకు ఎన్టీఆర్‌కు మించిన అర్హత ఎవరికి ఉంటుంది. ఆయన తప్ప ఆ పాత్రను ఎవరు చేయగలరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మహానటికి నివాళిగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తే బాగుండేదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.