స్వింగ్‌ జరా స్వింగ్‌… దుమ్ము రేపేస్తోంది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

NTR Tamanna  Swing Zara video song released in Jai lava kusa

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘జై లవకుశ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌ను తమన్నా చేసిన విషయం తెల్సిందే. ఆడియో విడుదల సందర్బంగా అయిదవ పాట చాలా స్పెషల్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు సస్పెన్స్‌లో పెట్టారు. దాంతో ఆ పాట ఎలా ఉంటుంది, సినిమాకు అది ఏ స్థాయిలో ఊపును ఇస్తుందని అంతా ఎదురు చూశారు. జై లవ కుశ మూడు పాత్రల్లో ఐటెం సాంగ్‌ ఎవరితో ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. 

ఎదురు చూపులకు తెర దించుతూ చిత్ర యూనిట్‌ సభ్యులు తమన్నా ఐటెం సాంగ్‌ స్వింగ్‌ జరా స్వింగ్‌ను విడుదల చేశారు. పాట టీజర్‌ను విడుదల చేయడంతో అభిమానును ఆనందంలో ముంచెత్తారు. తమన్నాతో జై రావన స్టెప్పులు అదిరిపోయాయి. జై పాత్రకు ఇది ఒక్కటే పాట ఉండే అవకాశం ఉంది. ఇక తమన్నా, ఎన్టీఆర్‌లు పోటా పోటీగా ఈ పాటలో స్టెప్పులు వేయడం చూడవచ్చు. ఇద్దరు కూడా అద్బుతమైన డాన్సర్‌లు అవ్వడంతో పాట రచ్చ రచ్చగా వస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు.