మొదటి వారంపైనే ‘జైలవకుశ’ ఆశలు..!

jai lava kusahopes on first week box office collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో నటించిన జై లవకుశ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 21న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమా వంద కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. నిర్మాత కళ్యాణ్‌ రామ్‌కు విడుదలకు ముందే లాభాలు వచ్చాయి. అయితే డిస్ట్రిబ్యూటర్లు సేవ్‌ అవ్వాలి అంటే మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా కనీసం 75 కోట్లను వసూళ్లు చేయాల్సి ఉంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత వారం రోజుల్లోనే స్పైడర్‌ చిత్రం విడుదల కాబోతుంది.

మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ కారణంగా భారీ ఓపెనింగ్స్‌ రావడం ఖాయంగా భావిస్తున్నారు. అంటే మొదటి వారం తర్వాత జై లవకుశ చిత్రంకు కలెక్షన్స్‌ తగ్గే అవకాశం ఉంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా సాదారణ స్థాయి కంటే కలెక్షన్స్‌ తక్కువగానే ఉంటాయి. అందుకే మొదటి వారం రోజుల్లోనే సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లు రాబట్టేందుకు నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్‌ మొదటి వారం రోజుల్లో సత్తా చాటి భారీ వసూళ్లను రాబడతాడా అనేది చూడాలి.