‘అజ్ఞాతవాసి’ ఎఫెక్ట్‌… కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్‌

NTR Trivikram movie shooting late

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. పవన్‌ 25వ చిత్రం అవ్వడంతో ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక పవన్‌ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరిలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాస్త ఆలస్యంగా చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

‘అజ్ఞాతవాసి’ ఫలితంతో దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేయాలని భావిస్తున్నాడు. అందుకే సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా పూర్తి అయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు పవన్‌ అజ్ఞాతవాసి కారణంగానే సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. ఫిబ్రవరి అనుకున్న సినిమా కాస్త మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా షూటింగ్‌కు వెళ్తున్నా కూడా అనుకున్న సమయంకే అంటే దసరాకే సినిమాను విడుదల చేసేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అజ్ఞాతవాసికి జరిగిన తప్పిదం ఎన్టీఆర్‌ మూవీకి రిపీట్‌ కాకుండా త్రివిక్రమ్‌ జాగ్రత్త పడాలని భావిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఈ చిత్రం కోసం తన బరువును తగ్గించుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.