ఎన్టీఆర్ కి 1 /2 కష్టం వచ్చింది.

NTR workouts for Trivikram and Rajamouli Movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడు అన్న దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్ కి భలే ఛాన్స్ తగిలింది. ఒక్క సినిమా కష్టంతో రెండు సినిమాలకు ప్రిపేర్ అయ్యే అవకాశం వచ్చింది. ఈ ఏడాది తారక్ కెరీర్ లోనే చాలా ప్రత్యేకం. త్రివిక్రమ్ తో పాటు రాజమౌళి సినిమాకి పని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల ఆహార్యం కోసం ఎన్టీఆర్ ఒంటికి డబల్ కష్టం తప్పదు అనుకున్నా అనుకోకుండా 1 / 2 కష్టంతో మ్యాటర్ సెటిల్ అవుతోంది.

జైలవకుశ లో రావణ పాత్ర కోసం కాస్త ఒళ్ళు చేసిన ఎన్టీఆర్ రాబోయే సినిమాలో ఎలా కనిపించాలని త్రివిక్రమ్ ని అడిగాడట. ఓ లవర్ బాయ్ యూత్ ఐకాన్ గా కనిపించేలా సన్నగా ఉంటే బావుంటుందని త్రివిక్రమ్ సలహా ఇచ్చాడట. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి సినిమాలో బాక్సర్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రెండు సినిమాలకు తగ్గట్టు కసరత్తు చేయడానికి తారక్ రెడీ అయిపోయాడు. ఇందుకోసం రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ హీరోలకు ఫిజికల్ ట్రైనర్ గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ ని నియమించుకున్నాడట ఎన్టీఆర్. ఆ విధంగా 1 / 2 ఖర్చు, కష్టంతో రెండు సినిమాలకు పనిచేస్తున్నాడు ఎన్టీఆర్.