ఎన్టీఆర్ పై ప్రభాస్ హాట్ కామెంట్…!

Prabhas Comments On Jr.Ntr

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ స్టార్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. అదే నేపద్యంలో జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా బాహుబలి టీం రానా, రాజమౌళి, ప్రభాస్ లు కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాం కి అటెండ్ అయ్యారు ఆ షో లో కరణ్ తనదైనా స్టైల్ లో ప్రభాస్ పైన ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరు అనుష్క తో డేటింగ్ చేస్తున్నరా అడిగిన ప్రశ్నకు ప్రభాస్ తడుముకోకుండా నో అనే సమాధానం చెప్పాడు.

టాలీవుడ్ లో ఎవరు బెస్ట్ హీరో అని ప్రశ్నకు ఆప్షన్స్ గా ఎన్టీఆర్…చరణ్…బన్నీ…. మహేష్ వీరిలో బెస్ట్ యాక్టర్ ఎవరు అనగా ప్రభాస్ టక్కున ఎన్టీఆర్ పేరు చెప్పేశాడు. అదే వేరే ఎవరైనా కొంత సేపు ఆలోచిస్తారు. లేక పొతే పాస్ అనే సమాధానం వస్తుంది కానీ ప్రభాస్ మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా ఎన్టీఆర్ పేరు చెప్పేసాడు ఆ తరువాత స్తానంలో చరణ్.. మహేష్.. బన్నీ లు ఉంటారు అన్నారు. ఇక బాలీవుడ్ లో హీరోయిన్స్ లో దీపిక.. అలియ భట్ట్ లో మీకు ఎవరు ఇష్టం అనగా ప్రభాస్ అలియ భట్ట్ పేరు చేపేశాడు.