విజువల్ వండర్ గా సాహో…!

Prabhas sahoo Movie As Visual Wonder

ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత తన సినిమాల స్పీడ్ ను పెంచేశాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరొయిన్ శ్రద్ద కపూర్ కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకుంది. అక్కడ భీకరమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటివరకు ఏ చిత్రంలో కూడా లేని విధంగా సాహో చిత్రంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకోసం హాలీవుడ్ నుండి కొంతమంది విజువల్ వర్క్ కు చెందినా టీం సాహో సినిమాకోసం పనిచేస్తుంది. ఎన్నో విజువల్స్ కూడిన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి అంటున్నారు. దుబాయ్ షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్నా ప్రభాస్ ఈ గ్యాప్ లో మరో సినిమాను పట్టలేకించాడు.

జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటలీలో జరుపుకుంది. అక్కడ ఈ చిత్రం హీరొయిన్ పూజ హెగ్డే ప్రభాస్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని తరవాత షెడ్యూల్ కు విరామం తీసుకుంది. ప్రభాస్ ఈ గ్యాప్ లో సాహో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడ ఇండియన్ షెడ్యూల్ తరువాత దాదాపుగా సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రాని యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఆ చిత్రాని నిర్మిస్తుంది. ఆ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.