వెంకీని ఒప్పించిన వినాయక్…!

Venkatesh Next Movie With Director VV Vinayak

టాలీవుడ్ గ్రేట్ డైరక్టర్ లో వివి. వినాయక్ ఒక్కడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. మెగా స్టార్ చిరంజీవికి ఖైది నెంబర్ 150వ చిత్రం ఇచ్చినప్పటికీ అది రీమేక్ చిత్రం కావడం వలన అవకాశాలు రావడం లేదు. మరోసారి మెగా కాంపౌండ్ నుండి ఇంటలిజెంట్ అనే సినిమాతో అవకాశం వచ్చిన ఆ సినిమా పరాజయం పాలు కావడంతో వివి వినాయక్ అంటేనే నో అనే పరిస్థితి ఏర్పడింది. అయితే వినాయక్ మాత్రం ఎక్కడనుండి మొదలు పెట్టామో అక్కడే తుక్కోవాలిని నందమూరి అందగాడు బాలకృష్ణ తో సి. కళ్యాణ్ నిర్మాతగా ఓ సినిమాను తియ్యాలని గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టాడు. అందుకోసం పక్క స్క్రిప్ట్ వర్క్ చేసి బాలకృష్ణ కోసం వెయిట్ చేశాడు. కానీ బాలకృష్ణ షాక్ ఇస్తూ తన తదుపరి సినిమాను బోయపాటి తో ఉంటుందని ప్రకటించాడు.

ఆ విషయంతో వినాయక్ మరల ఆందోళనలో పడ్డాడు. బోయపాటి సినిమా తరువాత అయినా చేద్దాం అంటే బాలకృష్ణ తదుపరి సినిమా, అనిల్ రావిపూడి తో ఉంటుందని సోషల్ మీడియాలో భాగా వార్తలు వస్తునాయి. దాంతో మరో సినియర్ హీరోని వెతికి పట్టుకున్నాడు అతనే విక్టరీ వెంకటేష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్మి అనే సూపర్ హిట్ట్ చిత్రం వచ్చింది. అప్పుడు ఏర్పడ్డ చనువుతో వెంకటేష్ ను కలిసి. వినాయక్ స్టొరీ వినిపించాడంట. వెంకీ కూడా ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు వెంకీ కూడా ఒకే చేసినట్లు సమాచారం. ఎలాగైనా వెంకీ తో హిట్ట్ కొట్టి మరల ట్రాక్ లోకి రావాలని వినాయక్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. వెంకీ కూడా సోలోగా వచ్చి హిట్ట్ కొట్టినవి ఈ మద్య లేవు. అందుకే మల్టి స్టారర్ మూవీస్ చేస్తున్నాడు. మారుతి డైరక్షన్ లో వచ్చినా బాబు బంగారం సినిమా తరువాత, వినాయక్ తో వెంకీ సోలో ఎంట్రి సినిమాకు సిద్దం అవ్వుతున్నాడు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నది.