వినయ విధేయ రామ చిత్రానికి చరణ్ కర్త కర్మ క్రియ…!

Vinaya Vidheya Rama Interval Fight Scene

రామ్ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో భరత్ అనే నేను సినిమా హీరొయిన్ కీయరా అద్వాని కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్, ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు వచ్చింది. ట్రైలర్ లో చూపించిన విధంగా హై వోల్టైజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి రూపొందించాడు. ఇకా ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

ఈ సందర్బంగా బోయపాటి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు దేనికవే స్పెషల్ అన్నారు. అలాగే కుటుంబ సన్నివేశాలు కుడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ముఖ్యంగా అజర్ బైజాన్ అనే దేశంలో చరణ్ పై తీసిన ఫైట్ ఇప్పటివరకు నేను చేసినా సినిమలోకేల్ల బెస్ట్ ఫైట్ గా నిలుస్తుంది. ఆ ఫైట్ కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఈ ఫైట్ కి కర్త కర్మ క్రియ అన్ని తానై నడిపించాడు. ఈ యాక్షన్ సన్నివేశంలో చరణ్ ఐరన్ మాన్ లాగా కనిపిస్తాడు అన్నాడు. మెగా ఫాన్స్ కూడా ఈ ఫైట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలుసు. ఈ ఫైట్ ధియేటర్ లో వచ్చేసరికి మెగా ఫాన్స్ ఈలలు గోలలు తో థియేటర్స్ దద్దరిలుతాయి అంటున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. ఇప్పటకే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లబిస్తుంది. ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.