‘ఒక్క క్షణం’ కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటీ?

Okka Kshanam Movie Box Office Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు శిరీష్‌ హీరోగా సురభి హీరోయిన్‌గా అవసరాల శ్రీనివాస్‌, శీరత్‌ కపూర్‌లు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘ఒక క్షణం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్ర దర్శకుడు విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెల్సిందే. నిఖిల్‌కు మంచి సక్సెస్‌ అందించిన దర్శకుడు ఆనంద్‌ తాజాగా మెగా హీరో అల్లు శిరీష్‌ కు కూడా సక్సెస్‌ను అందించాడు. విభిన్న కథాంశంతో థ్రిల్లర్‌ అంశాతో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించి పాజిటివ్‌ స్పందన దక్కించుకున్నాడు. మాస్‌ ఆడియన్స్‌ విషయం పక్కన పెడితే ఈ చిత్రం ఏ మరియు బి సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు అల్లు శిరీష్‌ ఈ చిత్రంతో 1.2 కోట్ల వరకు వసూళ్లు సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్‌ను ఈ చిత్రం సాధిస్తున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వచ్చిందని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషంగా ఉన్నారంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపుగా 10 కోట్ల వరకు షేర్‌ను రాబట్టింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మరో 5 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఆన్‌ లైన్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇలా అన్ని కలిపి దాదాపు 6.5 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం డబుల్‌ ప్రాఫిట్‌ను నిర్మాతకు తెచ్చి పెట్టిందని ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు.