ఒక్క క్షణం… తెలుగు బులెట్ రివ్యూ

Okka Kshanam Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు : అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ 

నిర్మాత:  చక్రి చిరుగుపాటి

దర్శకత్వం :   విఐ ఆనంద్

మ్యూజిక్ : మణిశర్మ

సినిమాటోగ్రఫీ:  శ్యామ్ కె నాయుడు 

ఎడిటర్ :  చోటా కె ప్రసాద్ 

గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అల్లు శిరీష్ తొలి సినిమాతో ప్లాప్ చవిచూశాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు – శుభమస్తు లాంటి లాంటి సినిమాలతో విజయాన్ని అందుకున్నా ఆ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆ హిట్, లాభం అన్న రెండు తప్ప కెరీర్ లో కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ కాదు. అందుకే ఇక రొటీన్ కి భిన్నంగా ట్రై చేద్దామని ఒకే సినిమా మీద ఏడాదికిపైగా సమయం వెచ్చించి” ఒక్క క్షణం “ సినిమా చేసాడు. దర్శకుడు వి.ఐ . ఆనంద్ చెప్పిన కథ శిరీష్ కి అంతగా నచ్చింది. ఆ ఇద్దరి నమ్మకాన్ని నమ్మి చక్రి చిగురుపాటి ఈ సినిమాకు నిర్మాతగా వచ్చారు.ఇక ఈ ముగ్గురి సినిమాకి ఓకే చెప్పడం ద్వారా అల్లు అరవింద్ కూడా “ఒక్క క్షణం “ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. వీళ్ళ నమ్మకం మీద నమ్మకంతో సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దామా.

కథ…

ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం వేటలో వున్న జీవా ( శిరీష్ )ఓ సారి షాపింగ్ మాల్ కి వెళతాడు. పార్కింగ్ ఏరియా లోనే వుండిపోయిన అతనికి జ్యోత్స్నా (సురభి ) కనపడుతుంది. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడతారు. జ్యోత్స్నా కి పక్కన వుండే అపార్టుమెంట్ లోని ఫ్లాట్స్ లో ఏమి జరుగుతుందో వారికి తెలియకుండా చూసే అలవాటు ఉంటుంది. ఓ ఫ్లాట్ లోకి కొత్తగా దిగిన జంట నిత్యం కీచులాడుకుంటూ వుంటారు. ఈ విషయాన్ని జీవా కి చెబుతుంది ఆమె. ఆ జంటలో భార్యని కొడుతున్న భర్త మీద కంప్లైంట్ చేద్దామని జ్యోత్స్నా అంటుంది. అయితే ముందుగా సమస్య తెలియకుండా అలా చేయడం మంచిది కాదని వారించిన జీవా అసలు విషయం తెలుసుకోడానికి ట్రై చేస్తాడు. భర్త శ్రీనివాస్ ని కలిసి వారి గురించి ఆరా తీస్తాడు. అప్పుడు జీవాకి షాక్ తెలిసే నిజాలు తెలుస్తాయి. వారి ప్రేమ కథ సేమ్ టూ సేమ్ జీవా , జ్యోత్స్నా ప్రేమ కథ లాగే ఉంటుంది. ఈ ఆశ్చర్యం నుంచి కోలుకోక ముందే శ్రీనివాస్ భార్య చనిపోతుంది. ఆమెని హత్య కేసులో శ్రీనివాస్ జైలు పాలవుతాడు. దీంతో వారి జీవితం లాగే తమ జీవితం అవుతుందని , జీవా తనని చంపుతాడని జ్యోత్స్నా భయపడుతుంది. ఇంతకీ శ్రీనివాస్ భార్యని ఎవరు చంపారు? ఎందుకు చంపారు ? జ్యోత్స్నా అనుకున్నట్టు జీవా చేతిలో ఆమె చావు రాసిపెట్టి ఉందా అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ…

ప్రపంచంలో ఓ మనిషిని పోలిన మనుషులు ఏక కాలంలో ఏడుగురు ఉంటారని ఓ నమ్మకం. ఈ కమ్యూనికేషన్ యుగంలో ప్రపంచం చిన్నది అయ్యాక ఆ నమ్మకం నిజమని కొన్ని సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పుడు ఒక్క మనిషి పోలిక కాకుండా ఇద్దరు ప్రేమికుల జీవితాలు ఒకే విధంగా ఉంటే ఏమి అవుతుంది అన్న పాయింట్ చుట్టూ దర్శకుడు ఆనంద్ ఈ కథ అల్లుకున్నాడు. సమాంతర జీవితం ( పార్లల్ లైఫ్ ) పేరుతో ఇప్పటికే ఈ కోణంలో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పాయింట్ తో పాటు జాతకం ,సైన్స్ కి మించిన ఏదో శక్తి మనల్ని కాపాడుతుందని కూడా ఆనంద్ చెప్పదల్చుకున్నాడు. ఈ రెండు పాయింట్స్ ని ఓ లవ్ స్టోరీ, ఓ మర్డర్ మిస్టరీ తో మిక్స్ చేసాడు. వినడానికి, చెప్పడానికే ఇంత కాంప్లెక్స్ గా వున్న ఈ నాలుగు స్తంభాల మీద ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క క్షణం సినిమా తీసాడు దర్శకుడు ఆనంద్.

కొత్త పాయింట్ ని టచ్ చేసినప్పటికీ తెర మీద కనిపించించే క్యారెక్టర్స్ అన్నీ నిత్య జీవితంలో మనం చూసేవే. అందుకే ఎక్కడా ప్రేక్షకుడికి ఏదో పెద్ద పాయింట్ చెబుతున్న ఫీలింగ్ కలగలేదు. పైగా మన లాంటి ఇంకో జీవితం , ప్రియుడుతో ప్రమాదం అని భయపడే ప్రేమికురాలు వంటి పాయింట్స్ తో మంచి సంఘర్షణ తో పాటు వినోదం పండించాడు దర్శకుడు ఆనంద్. ఇంతకు ముందు టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా తీసినప్పటికీ ఈ సినిమాతో ఆయన ఇంకో లెవెల్ కి వెళ్ళాడు అనిపించింది. ముఖ్యంగా ఇంత కాంప్లెక్స్ స్క్రిప్ట్ ని ఇంత సులభంగా చూపిన అతని స్క్రీన్ ప్లే మేజిక్ గురించి చెప్పుకోవాలి. అయితే ఫస్ట్ హాఫ్ తర్వాత ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సెకండ్ హాఫ్ సెట్ కాలేదు. సెకండ్ హాఫ్ బాగున్నా ఇంకా చేసి వుండాల్సిందేమో అనిపిస్తుంది. దీంతో ప్రేమ, విధి మధ్య పోరాటం కాస్తా మర్డర్ మిస్టరీ అయిపోయింది.

ఇక ఇందులో ప్రతి పాత్రకు ఓ ఐడెంటిటీ వుంది. హీరో శిరీష్, హీరోయిన్ సురభి కి ఈ సినిమా ప్లస్. గతంతో పోల్చుకుంటే శిరీష్ నటన లో కొంత మెరుగుదల వచ్చింది. వాచకం బాగా మెరుగు అయ్యింది. ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ మీద ఇంకా కసరత్తు చేయాలి. అయితే క్లయిమాక్స్ తో పాటు కొన్ని చోట్ల అతని నటనలో పరిణితి కనిపించింది. ఈ స్క్రిప్ట్ ని ఓకే చేసినందుకు అతన్ని మెచ్చుకు తీరాలి.సురభి బాగా చేసింది. అవసరాల శ్రీనివాస్ , సీరత్ కపూర్ ఎప్పటి లాగానే ఏ లోపం లేకుండా చేశారు. కామెడీ, వినోదం తో పాటు రోహిణి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సత్య కామెడీ టైమింగ్ సూపర్బ్. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన దాసరి అరుణ్ కుమార్ నటన చూస్తే ఇన్నాళ్లు దర్శక,నిర్మాతలు ఇతన్ని ఎందుకు మిస్ అయ్యారా అనిపిస్తుంది.

ఇక సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మణిశర్మ ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు.పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. శ్యాం .కే . నాయుడు కెమెరా పనితనం బాగుంది.

ప్లస్ పాయింట్స్ …

కథ
కధనం
నటీనటులు
వినోదం
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ …
సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ ట్రాక్ తప్పడం.

తెలుగు బులెట్ పంచ్ లైన్ …”ఒక్క క్షణం “ లో జీవితాలు మారిపోతాయి.
తెలుగు బులెట్ రేటింగ్ …3 /5 .