ఎఫ్‌బీఐ వాంటెడ్‌ లిస్టులో భారతీయుడు

ఎఫ్‌బీఐ వాంటెడ్‌ లిస్టులో భారతీయుడు

అహ్మదాబాద్‌ కు చెందిన భద్రేశ్‌ కుమార్‌ పటేల్‌ అమెరికా లోని డంకిన్‌ డోనట్స్‌ స్టోర్‌ లో పని చేస్తు ఉండేవాడు. 2015 ఏప్రిల్‌ 12న రాత్రి సమయం లో భార్య ఫలక్‌తో కలిసి కిచెన్ కి వెల్లి చాలా సార్లు కత్తితో తన భార్యని హత్య చేసి పొడిచి కాసేపు అయ్యాక బయటకి వచ్చాడు. పోలీసులు  భద్రేశ్‌ కుమార్‌ పటేల్‌ భార్య ఫలక్‌ మృత దేహాన్ని కొద్ది గంటల తర్వాత కనుకుని దర్యాప్తు లో సీసీ టీవీ ఫుటేజీల ప్రకారం భద్రేశ్‌ కుమార్‌ పటేల్‌ టాక్సీలో హోటల్‌కు వెళ్లి రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారాక జాడలేకుండా ఉన్నాడు.

ఎఫ్‌బీఐ-అమెరికా దర్యాప్తు సంస్థ భద్రేశ్‌ కుమార్‌ పటేల్‌ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకూ వెతికినా పట్టు కోలేక పోయారు. అమెరికాలోనే గాక భారత్‌ లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలో వెతికినా అతన్ని పట్టుకోలేక పోయారు. అమెరికా-భారత్ కలిసి చేసిన కేసు విచారణలో ఇదే పెద్దది. ఏకంగా 70లక్షల రూపాయల రివార్డు ప్రకటించి వెతికినా నాలుగేళ్లుగా దొరకలేదు. తప్పించుకొని పోలీసులను తిప్పలు పెడుతున్న భద్రేశ్‌ కుమార్‌ అహ్మదాబాద్‌కు చెందినవాడు.