ఇలాంటివి ఎయిరిండియాకే సాధ్యం

on air india flights in india economy non veg for business

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వేల కోట్ల అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిరిండియాను.. అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. అధికారికంగానే ఫర్ సేల్ బోర్డు పెట్టింది. ఇప్పటికే స్పైస్ జెట్, టాటా సంస్థలు సంప్రదింపులు కూడా జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఎయిరిండియా తీసుకున్న నిర్ణయం కామెడీగా మారింది. దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాసులో ఇకపై మాంసం వడ్డించరట. కేవలం శాకాహరమే పెడతారట. ఎందుకని అని అడిగితే ఖర్చు కంట్రోల్ అని కథలు చెబుతున్నారు.

నాన్ వెజ్ బదులుగా వెజ్ పెడితే ఖర్చు ఎలా తగ్గుతుందో అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారట. నిజంగా రేట్లు తగ్గించుకోవాలనుకుంటే.. వెజ్ బదులుగా నాన్ వెజ్ ఆఫర్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం కూరగాయల ధరలు మాంసం ధర కంటే ఎక్కువగానే ఉన్నాయనేది జనం మాట. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ శాకాహారం పెడితే.. ఖర్చు తడిసి మోపెడవుతుందన్న ఇంకిత జ్ఞానం ఎయిరిండియా అధికారులకు లేదని విమర్శలు వస్తున్నాయి.

అసలు స్వాతంత్ర్యం రాకముందు టాటాల ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్ లైన్స్ లాభాల్లోనే ఉంది. కానీ ఎయిర్ లైన్స్ తీసేసుకున్న కేంద్రం చేసిన నిర్వాకం ఫలితంగానే ఎయిరిండియా ఇంత దీన స్థితికి చేరింది. ఇప్పటికైనా పనికిమాలిన సలహాలివ్వడం మానేసి.. అధికారులు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎయిరిండియా కోలుకోవడం కష్టం కాదంటున్నారు నిపుణులు. అందుకే ప్రైవేట్ సంస్థలు ఎయిరిండియా కొనుగోలుకు క్యూ కడుతున్నాయి. ఎయిరిండియా బ్రాండ్ ఏమవుతుందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.