మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో కె3 ని గతంలో చైనా మార్కెట్లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఇవాళ ఒప్పో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ పవర్ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.16,990 ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.19,990గా ఉంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో విక్రయించనున్నారు.
ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, యూఎస్బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.