టీజర్‌ రివ్యూ : ‘పందెంకోడి 2’ ఆట ఆదిరింది

Pandem-Kodi-2-Official-Teas

విశాల్‌, లింగు స్వామి కాంబినేషన్‌లో 2005లో అంటే దాదాపు 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో విశాల్‌కు ఒక బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసిన ఆ చిత్రం తెలుగులో విశాల్‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో విశాల్‌కు పందెంకోడి తర్వాత అంతటి సక్సెస్‌ మళ్లీ రాలేదు. ఇప్పుడు మళ్లీ విశాల్‌ పందెం కోడితో రెడీ అయిపోయాడు. పందెం కోడికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’ చిత్రం దసరాకు విడుదలకు సిద్దం అవుతుంది.

Pandem Kodi 2 teaser

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘పందెంకోడి 2’ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. మొదటి పార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా విశాల్‌లోని మాస్‌ యాంగిల్‌ను చూపిస్తూ దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుది. ఈ చిత్రంలో మరింత యాక్షన్‌ను దర్శకుడు చూపించబోతున్నాడు.

pandem-kodi2

మొదటి సినిమా కథకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా టీజర్‌లోనే దర్శకుడు చెప్పాడు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించడం అదనపు ఆకర్షణ అవ్వబోతుంది. మరో హీరోయిన్‌గా వరలక్ష్మి నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. దసరాకు విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో గట్టిగా సక్సెస్‌ను కొట్టడం ఖాయం అని టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తోంది.