హైకోర్టులో తెరాసకు ఊరట !

high-court-dismisses-pil-against-pragati-nivedana-sabha

టీఆర్ఎస్ సర్కార్‌ కు హైకోర్టు ఊరట నిచ్చింది. సెప్టెంబర్ 2న ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలకున్న ప్రగతి నివేదన సభపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సభను ఆపాలంటూ లాయర్, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సభ వల్ల ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం నివేదికను ప్రకటించాలనుకుంటే టెక్నాలజీ సాయంతో మాధ్యమాల ద్వారా ఆ పనిని చేయొచ్చని పిటిషన్‌లో ప్రస్తావించారు. సభకు అనుమతి ఇవ్వొద్దని కూడా కోరారు.

kcr
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు..ఇరువర్గాల వాదనల్ని విన్నది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పిటిషన్ దారుడు ప్రస్తావించినట్లుగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభ నిర్వహించుకోవాలని ఆదేశిస్తూ దానిని ఆపాలని దాకల్యిన పిటిషన్‌ను కొట్టివేసింది.

kcr