పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరని చెప్పిన అభిమానులు

పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరని చెప్పిన అభిమానులు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంటే ముందు పవన్ అనే వ్యక్తి సినీ హీరో అలాగే ఓ స్టార్ హీరోగా కంటే కూడా ఒక వ్యక్తిగా పవన్ ను అనేక మంది ఫాలో అవుతుంటారని అందరికి తెలిసిందే.మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న ఒక్క మచ్చ తప్ప వ్యక్తిగా పవన్ ను విమర్శించడానికి అయితే పవన్ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరని అభిమానులు తెగేసి చెప్పేస్తారు.ఇప్పుడు అలాంటి అభిమానులే పవన్ చేసిన ఓ పనికి నీకెందుకయ్యా ఇలాంటి పనులు అని కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “కేంద్రీయ సైనిక బోర్డు కుటుంబాల సంక్షేమార్థం” అక్షరాలా 1 కోటి రూపాయలు విరాళం చేసారు.దీనితో కొంతమంది అభిమానులు నీకెందుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పనులు ఆ డబ్బులేదో ఎన్నికల్లో పంచి గెలువు ఇలా దాన ధర్మాలు చేస్తే గెలవవు.ఇప్పటికి ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కానీ ఇలా ఏనాడైనా తమ సంపాదన లోనుంచి ఒక్క రూపాయి అయినా దానం చేసిన దాఖలాలు మనం చూసామా?ఈ జనాలకు దాన ధర్మాలు చేసే వాడికన్నా వాళ్ళ పొట్ట కొట్టి ఎన్నికలకు ముందు తలా ఇంత పారేసిన వారినే గెలిపించుకుంటారని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.