అజ్ఞాతవాసి కోసం వెంకీ రెండు రోజులు

Agnathavasi movie venkatesh Role shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌లు కలిసి గతంలో ‘గోపాల గోపాల’ చిత్రం నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య మంచి సన్నిహిత్యం ఉంది. ఆ కారణంగా మరోసారి వీరిద్దరు కలిసి నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ 25వ చిత్రంగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా అజ్ఞాతవాసి కోసం రెండు రోజుల చిత్రీకరణలో వెంకటేష్‌ పాల్గొన్నాడు. వెంకటేష్‌, పవన్‌ల కాంబినేషన్‌లో సీన్స్‌ ఉండవని, వెంకటేష్‌తో కొంతమంది ముఖ్య నటీనటులు కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుతున్నారు.

భారీ స్థాయిలో అంచనాలున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌ చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లతో పవన్‌ చేసిన రొమాన్స్‌ ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం 150 కోట్ల వసూళ్లను సాధించడం ఖాయం అని టాప్‌ 5 చిత్రాల జాబితాలో ఈ చిత్రం నిలుస్తుందని మెగా ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలు నెరవేరేనో చూడాలి.