పవన్‌కు మామగా వెంకీ..?

pawan kalyan as Nephew of Venkatesh in Agnathavasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ విడుదలకు సిద్దం అవుతుంది. ఈ నెల 30న సెన్సార్‌ ముందుకు వెళ్లబోతున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అనగానే అందరికి చాలా అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం పవన్‌కు 25వ చిత్రం అవ్వడంతో ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు త్రివిక్రమ్‌ హీరో వెంకటేష్‌ను రిక్వెస్ట్‌ చేసి ఒక చిన్న పాత్రను చేయించాడు. పవన్‌, వెంకీలు గతంలో ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత మళ్లీ కలిసి నటించిన సినిమా ఇదే. ఈ చిత్రంలో వెంకటేష్‌ సినిమా ప్రారంభంలో నాలుగు నిమిషాలు కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రంలో వెంకీ పాత్ర అనగానే ఆసక్తి మరింతగా పెరిగింది. పవన్‌కు మేనమామగా వెంకటేష్‌ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. పవన్‌, వెంకీల కాంబినేషన్‌లో సీన్స్‌ ఉండవు అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి కాంబినేషన్‌లో రెండు నిమిషాల కంటిన్యూ సీన్స్‌ ఉంటాయని, ఆ తర్వాత మరో రెండు నిమిషాల పాటు వెంకీ సోలో సీన్స్‌ ఉంటాయని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు నటించారు. ఖుష్బు ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.