చరణ్‌ను రంగంలోకి దించడం కోసం పవన్‌ ఇలా..!

Pawan Kalyan attends Ram Charan Birthday function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ఫ్యాన్స్‌ను నిన్న మెగా ఫ్యామిలీ సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ కేక్‌ కట్‌ చేయించి, అక్కడే లంచ్‌ చేశాడు. చాలా సమయం పాటు చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌లతో పవన్‌ సరదాగా గడిపినట్లుగా కూడా తెలుస్తోంది. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవన్‌ దగ్గరగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. పవన్‌ రాజకీయాలతో చాలా బిజీ అయినప్పటికి మెగాస్టార్‌కు సన్నిహితంగా ఉంటూ, ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇలా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండటం వెనుక ఒక రాజకీయ కారణం ఉంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతుంది. పవన్‌ కళ్యాణ్‌ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ తన అనుకున్న వారందరితో సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా యూత్‌లో భారీ క్రేజ్‌ ఉన్న చరణ్‌తో పవన్‌ సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున రామ్‌ చరణ్‌ను ప్రచార రంగంలోకి దించాలని, ఏపీలో పలు నియోజక వర్గాల్లో మరియు తెలంగాణలో రామ్‌ చరణ్‌తో జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేయించాలని జనసేనాని భావిస్తున్నాడు. అందుకే ఇలా బర్త్‌డేకు విషెష్‌ చెప్పడంతో పాటు, ఇంకా అన్ని విధాలుగా సన్నిహితంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.

ఆ మద్య రామ్‌ చరణ్‌ స్వయంగా ఫేస్‌బుక్‌లో బాబాయి పవన్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే మెగా ఫ్యాన్స్‌ మాత్రం పవన్‌ ఇలా రాజకీయాలు చేయడు అంటున్నారు. వచ్చే సంవత్సరంలో జరుగబోతున్న ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ పవన్‌కు ఏ మేరకు మద్దతుగా నిలుస్తారు, వారి మద్దతు ఎంత వరకు పవన్‌కు ఉపయోగపడుతుందనే విషయం చూడాలి.