అష్ట కష్టాలు పడుతున్న వర్మ

Nagarjuna Officer Movie Gets Buyers Problem

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గత కొంత కాలంగా ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి కమర్షియల్‌ విజయాలను అందుకోలేక పోయాడు… ఈయన దర్శకత్వంలో గత దశాబ్ద కాలంగా ఒక్క హిట్‌ సినిమా కూడా వచ్చింది లేదు. అయినా కూడా వర్మ ప్రస్తుతం చేస్తున్న నాగార్జున ‘ఆఫీసర్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. వర్మ ఏదైనా అద్బుతాన్ని సృష్టిస్తాడేమో అంటూ నమ్మకంగా ఉన్నారు. అయితే సినీ వర్గాల వారు మాత్రం వర్మ, నాగ్‌ సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకున్నట్లుగా లేదు. అందుకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.

వర్మ స్వయంగా ఈ చిత్రాన్ని తన కంపెనీ బ్యానర్‌లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగు రాష్ట్రా థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా 15 నుండి 17 కోట్లు వస్తుందని దర్శకుడు వర్మ భావించాడు. తెలుగు రాష్ట్రాల హక్కులు గుండు గుత్తగా ఒక్కరికే ఇచ్చేయాలనేది వర్మ ప్లాన్‌గా తెలుస్తోంది. అయితే అలా తీసుకునేందుకు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్‌ లేదా నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. కొన్ని ఏరియాల్లో చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నా మొత్తంగా కొనుగోలు చేయాలంటే సాహసించడం లేదు. దాంతో తన సినిమాను అమ్మేందుకు వర్మ అష్టకష్టాలు పడుతున్నాడని, అందరి దృష్టిని ఆకర్షించేందుకు అఖిల్‌తో సినిమా అంటూ ప్రకటిస్తున్నాడు అంటూ కొందరు భావిస్తున్నారు. మొత్తానికి వర్మ వంటి ఒక గొప్ప దర్శకుడి మూవీ, నాగార్జున వంటి స్టార్‌ హీరో మూవీకి బయ్యర్లు కరువు అవ్వడం దారుణం అంటూ సినీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.