పవన్ ది శకుని పగ.

Pawan-kalyan-behaves-like-S

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మహాభారతం లో శకుని పాత్ర జిత్తులమారిగా కనిపిస్తుంది. మాయాజూదంతో పాండవుల్ని మోసం చేసాడని భారతం చెబుతోంది. ఆ జూదం ఆడిన పాచికలకు అదృశ్య శక్తులు ఎలా వచ్చాయి అన్న కధ మాత్రం కొద్ది మందికే తెలుసు. గాంధార రాజుగా ఉండాల్సిన శకుని కేవలం దుర్యోధనుడి మామగానే కనిపించడం వెనుక పెద్ద కధ వుంది. గాంధార రాజు పుత్రిక గాంధారికి జాతకంలో భర్త చనిపోయి విధవ అవుతుందని వుంది. దీన్నుంచి తప్పించుకోడానికి ఓ గొర్రె తో ఆమెకు రహస్యంగా పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత ఆ గొర్రెని చంపి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటుండగా అనుకోని సమస్య ఎదురు అవుతుంది. కురు సామ్రాజ్యం నుంచి అంధుడు అయిన దృతరాష్ట్రునితో పెళ్ళికి గాంధారి ని ఇవ్వాలని కోరుతారు. గాంధార రాజుకు ఇష్టం లేకపోయినా ఆ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది.

Shakuni

పెళ్లి తర్వాత ఆమెకి గొర్రె తో పెళ్లి జరిగిన విషయం తెలిసి గాంధార రాజు సహా ఆ రాజవంశంలోని పురుషులందరినీ కూరు రాజు బంధిస్తారు. వారిని నేరుగా చంపడం ఇష్టం లేక బందిఖానాలో వున్నవారికి రోజుకు ఒక్కొరికి ఒక్కో మెతుకు ఆహారంగా ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఆ ఒక్క మెతుకు తిన్నతినకపోయినా చనిపోతాం అని తెలుసుకున్న గాంధార రాజ వంశీయులు అందరూ తమ ఆహారాన్ని ఒక్కరికే అందులో చిన్నవాడైన శకునికి పెట్టి అతన్ని బతికించి తాము చనిపోతారు. చివరకు శకుని ఒక్కడే మిగులుతాడు. అతను ఒక్కడు ఏమి చేస్తాడులే అని అతన్ని వదిలేస్తారు. అయితే పాత పగను మనసులో దాచుకుని మొదటినుంచి దుర్యోధనుని చెడు వైపు నడిపించి పరోక్షంగా కౌరవుల అంతానికి కారణం అయ్యాడని చెప్పుకుంటారు.

ఈ ఉప కధలో నిజం ఎంతోగానీ ఇప్పుడు తెలంగాణ పర్యటన ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే శకుని రీతిలో కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అనిపిస్తోంది. శత్రువు ని ఎదురుగా ఢీకొట్టలేనప్పుడు వేరే దారిలో ఇలా పగ తీర్చుకోవడం శకుని మార్క్ అయితే పవన్ కూడా అదే దారిలో నడిచినట్టు. రాష్ట్ర విభజన సమయంలో, అంతకు ముందు కెసిఆర్ , పవన్ ల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు.ఆ పరిణామంతో పవన్ తెలంగాణకు వ్యతిరేకి అని తెరాస ప్రచారం చేసింది. ఎక్కువ మంది తెలంగాణ వాదులు ఆ విషయాన్ని నమ్మారు. విభజన తర్వాత పవన్ ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. అయితే ఆయన అనూహ్యంగా తెలంగాణ పర్యటనకు రావడం ఆశ్చర్యం. పైకి ఈ పర్యటన కెసిఆర్ కి అనుకూలంగా అనిపిస్తోంది. పవన్ మాటల వల్ల అయితేనేమి, కాంగ్రెస్ ప్రచారం వల్ల గానీ జనసేన మీద కెసిఆర్ అనుకూల ముద్ర పడింది. కానీ నిజానికి పవన్ పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా కెసిఆర్ మీద ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ గళం గట్టిగా వినిపిస్తోంది.

ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పవన్ శకుని టైపు లో కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడేమో అనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. నిజానికి రాజకీయంగా జనసేన ఎంచుకున్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్. అక్కడే ఇంకా పార్టీ పోటీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తెలియదు. రాజకీయంగా ఎవరితో ఎలా ఉంటుందో అర్ధం కాదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సిన అవసరం, శక్తి పవన్ కి లేవని అందరికీ తెలుసు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ పవన్ ఇంకా బాగా తెలుసు. అయినా పనిగట్టుకుని పర్యటన చేసి కెసిఆర్ వ్యతిరేకులకు తిరుగులేని అస్త్రం అందించిన పవన్ ని శకుని పగతో పోల్చడం తప్పుకాదు అనిపిస్తోంది.