ఆ స్వామి, బాబు మధ్య బాలయ్య… సినిమాతో రాజీ వర్కౌట్ అవుతుందా?

Balakrishna meets with Chinna Jeeyar Swamy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ ప్రత్యర్థులకు పడకపోవడం సహజం. కానీ ఆయన అంటే కొందరు స్వామీజీలకు కూడా పడదు. ఈ విషయంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ బహిరంగంగా బయటపడతారు. ఇక శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అవకాశం వచ్చినప్పుడు కనబడుతుంటారు. ఈ ఇద్దరు స్వాములు పైకి చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులకు మద్దతుగా ఉంటారని అర్ధం అవుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టే ఆంధ్రాలో శారదా పీఠాధిపతిని వైసీపీ అధినేత జగన్ ఏ స్థాయిలో గౌరవంగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణాలో చినజీయర్ స్వామికి సీఎం కెసిఆర్ అపార గౌరవం ఇస్తున్నారు. ఈ సమీకరణాల్లో మార్పు కోసం ఏపీ సీఎం చంద్రబాబు పెద్దగా ప్రయత్నించినట్టు కూడా ఎప్పుడూ కనిపించలేదు. తెలంగాణ విషయం ఏమో గానీ ఈ రోజు కనిపించిన ఓ దృశ్యంతో ఆంధ్రాలో పాత సమీకరణాలు కొన్ని మారతన్నాయేమో అనిపిస్తోంది.

హిందూపురం ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది కం వియ్యంకుడు ఈ ఉదయం అమరావతి సమీపంలో తాడేపల్లి మండలం, సీతానగర్ విజయ కీలాద్రి పై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తి భావం ఎక్కువగా వుండే బాలయ్య ఇలాంటి వాటిలో పాల్గొనడం కొత్త కాకపోయినా విజయ కీలాద్రి వ్యవహారాలు చినజీయర్ స్వామి పరిధిలో జరిగేవి కావడమే విశేషం. బాబు కి వ్యతిరేకంగా వుండే స్వామి బాలయ్య ని పూజలకు పిలవడమే ఆశ్చర్యం. ఇక అక్కడ బాలయ్య ఏమి మాట్లాడారో చూద్దాం.

బాలయ్య కామెంట్స్
నాన్న గారు తీయలేకపోయిన సినిమా లను నేను పూర్తి చేస్తాను…

రామనుజాచార్యుల సినిమా త్వరలో నేను చేస్తాను….

ఆధ్యాత్మిక గురువే కాక గొప్ప సంఘసంస్కర్త రామనుజాచార్యుల వారు…

వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి రామనుజులు…

విజయకీలాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది…

రామనుజాచార్యుల గుర్తుగా స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు…

రామానుజ చార్య కు ప్రచారం కల్పించేందుకు కొన్నాళ్లుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఎంత కృషి చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు ఆ ప్రయత్నంలో తాను కూడా భాగం అయ్యేందుకు బాలయ్య సిద్ధపడడం చూస్తుంటే స్వామి, బాబు మధ్య సయోధ్య సంకేతాలు కనిపిస్తున్నాయి. రామానుజుల వారి సినిమాతో ఆ ఇద్దరి మధ్య రాజీ కూడా వర్కౌట్ అవుతుందేమో !