రైతుల ఆందోళన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

రైతుల ఆందోళన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

రాజధాని తరలింపు, రైతుల ఆందోళన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన పవన్, విభజన చట్టం ప్రకారం రాజధాని విషయం లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉందని తెలిపారు. అయితే రాజధాని అంశం ఫై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. రాజధాని విషయంలో బీజేపీ, కాంగ్రెస్ తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలనీ డిమాండ్ చేసారు పవన్.

అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూములిచ్చిన రైతులతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని పవన్ డిమాండ్ చేసారు. ఈ నిర్ణయం ద్వారా రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు, జరగకూడదు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఒక పక్క రైతుల ఆందోళనలు, చంద్రబాబు అమరావతిలో పర్యటన ఇవన్నీ ఉండగా, తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. మరి ఈ విషయం ఫై మిగతా పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.