అమరావతి పరిస్థితుల ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

అమరావతి పరిస్థితుల ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

అమరావతిలో నెలకొన్న పరిస్థితుల ఫై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రైతుల తో ముచ్చటించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అమరావతి విషయం ఫై ఒక స్పష్టమైన వైఖరిని జనసేన తెలపబోతుందా లేదంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి పార్టీకి సూచనలు ఇచ్చే అవకాశం వుందా అన్నది మరి కొద్దీ సేపట్లో తేలనుంది.

పవన్ కళ్యాణ్ తాజాగా అమరావతి పరిస్థితుల ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ ల వైఖరి ఏంటో చెప్పాలని పవన్ డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి పాలిస్తారా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. జేసీ దివాకర్ రెడ్డి సైతం అమరావతిని విశాఖకు తరలిస్తే గ్రేటర్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఉద్యమాలు చేపడతామని తెలిపారు.