మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్

మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్

ప్రజలకు కరోనా నుండి కాపాడుకోవటానికి ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పటమే కాదు ప్రధాని మాట విందాం అని మాద్దు పలికారు పవన్ కళ్యాన్ . మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో అందరం సమైక్యంగా పోరాటం సాగించాలని సూచించారు. అంతే కాదు కరోనా రిలీఫ్ ఫండ్ కు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు .

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇక కరోనా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 21,295 మంది మరణించారు. భారత దేశం మీద కూడా కరోనా ప్రభావం ఉంది .ఇండియాలో 600లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టటానికికేంద్రం దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కరోనాపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటానికి రాజకీయ ప్రముఖులు , వ్యాపారవేత్తలు తమ వంతు సాయం అందిస్తున్నారు.

ఇక మొదట నుండి మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై యుద్ధం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షలు చొప్పున కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఆయన ఈ డబ్బును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయబోతున్నారు. అదే విధంగా పీఎం సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.