రోజురోజుకి క్షీణిస్తున్న ‘పవర్ స్టార్’ ఆరోగ్యం

రోజురోజుకి క్షీణిస్తున్న పవర్ స్టార్ ఆరోగ్యం

మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ మంచం పట్టారు. ఇది గాలి వార్త కాదు. స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయం. విజయవాడలో ఓ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావల్సి ఉన్నా అనూహ్య పరిస్థితుల్లో రద్దు చేసుకున్నారు. ఇందుకు కారణం వివరిస్తూ తన అనారోగ్య సమస్యను పవన్ బయటపెట్టారు.

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో వెన్నుపూసలకు తీవ్ర గాయాలు అయ్యాయని.. ఆ నొప్పి తనను తరచూ బాధిస్తోందని పేర్కొన్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయటంతో గాయాల నొప్పి తీవ్రమైందని.. నొప్పి పెరిగిందన్నారు.

వైద్యులు ఆపరేషన్ అవసరం అని చెప్పారని,  అయితే.. సంప్రదాయ వైద్యం మీద ఉన్న నమ్మకంతో తాను ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో వెన్నునొప్పికి వైద్యం చేయించుకున్న ఆయన.. గడిచిన కొద్ది రోజులుగా మళ్లీ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. మూడు రోజులుగా సమస్య తీవ్ర ఎక్కువగా ఉండటంతో పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో తాను పాల్గొనలేకపోతున్నందుకు ఆవేదన వ్యక్తంచేశారు పవన్ కళ్యాణ్.