“రేణు దేశాయ్ గారూ “అని పవన్ పిలుపు.

Pawan Kalyan Wishes to Renu Desai On her Engagement

మాజీ భార్య రేణు దేశాయ్ ఇంకో పెళ్లికి సిద్ధం కావడాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగతించారు. తన ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆమెని ఇంకో పెళ్లి చేసుకోవద్దంటూ చెప్తున్న వేళ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ఈ అంశం మీద స్పందించారు. ఆమె సంతోషకరమైన జీవితంలో ప్రవేశిస్తున్న వేళ సుఖశాంతులతో జీవించాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశం పెట్టారు. అయితే ఆ సందేశం లో వయసులో చిన్నది అయినప్పటికీ ఆమెను “రేణు దేశాయ్ గారూ” అని సంబోధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఓ విధంగా ఈ పిలుపు ద్వారా ఆమె ఇక పరాయి వ్యక్తి అని చెప్పడంతో పాటు, రేణు ని గౌరవంగా చూడాలని ఫ్యాన్స్ కి సందేశం ఇవ్వడం కూడా. పవన్ ఉద్దేశం ఏది అయినప్పటికీ ఈ పిలుపు మీద కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. చేయాల్సింది చేసి ఇప్పుడు “గారు” అని పిలిచినా ప్రయోజనం లేదని ఆ విమర్శకుల వాదన. ఇంకొందరు మాత్రం ఈ సోషల్ మీడియా పోస్ట్ లోనే రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యాఖ్యలు చేయొద్దని నేరుగా పిలుపు ఇస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

రేణు దేశాయ్ గురించి ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ తో ఆమె రెండో వివాహం ఎపిసోడ్ లో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే. ఇంతకీ పవన్ ట్వీట్ లో ఏముందో మీరే చూడండి.

 

pawan-Kalyan-tweet-about-Re