పోలీసులపై వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు

పోలీసులపై వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు

గత 10 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌ చటాన్‌పల్లి సర్వీస్‌ రోడ్డు ప్రాంతంలో నలుగురు మృగాలు వెటర్నరీ డాక్టర్ దిశ పై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి దహనం చేశారు. కాగా తిరిగి అదే ప్రాంతంలో శుక్రవారం నాడు ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. కాగా ఈ ఎన్ కౌంటర్ ఘటనపై ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. కాగా ఈ ఘటనలో న్యాయపరమైన చర్యలు జరపాల్సింది పోయి అత్యంత పాశవికంగా ఎన్ కౌంటర్ చేసినటువంటి పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ వేశారు.

కాగా చటాన్‌పల్లి సర్వీస్‌ రోడ్డు బ్రిడ్జి కింద వెటర్నరీ డాక్టర్ దిశ ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. ఈ పోలీసులు జరిపినటువంటి ఎన్ కౌంటర్ పై సర్వత్రా వ్యతిరేకత మొదలవుతుందని చెప్పాలి. కాగా నిందితుల కుటుంబాలు, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు అన్ని కూడా పోలీసులపై వ్యతిరేకంగా న్యాయస్థానం ద్వారా విచారణ జరిపేందుకు పోరాటాన్ని చేస్తున్నారు.