ఆయన్ని నమ్మితే ఇంకో నాలుగేళ్ళు ఎక్కువ బతికేయచ్చు !

people-believes-god-will-live-4-years-more

దీర్ఘాయుష్మాన్ భవ గుడికి వెళ్ళే అందరినీ దాదాపు అక్కడి అయ్యవారు ఆశీర్వదించే ఆశీర్వాదం ఇది. అంటే నిండు నూరేళ్ళు ఆయువుతో వర్ధిల్లు అని అర్ధం. ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక పరిశోధన ఫలితం వింటే మీరు కూడా గుడి బాట పడతారు ఏమో. దాని ప్రకారం దేవుడిని నమ్మి గుడికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకునే ఆస్తికులు నాస్తికుల కంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారని పరిశోధకులు తేల్చారు. దైవ భక్తి ఉన్నవాళ్లకీ, పూజలు పునస్కారాలపై నమ్మకలేని వారికీ మధ్య జీవన విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆ పరిశోధనల్లో తేలింది. ఒహియో యూనివర్శిటీ సైకాలజీ అసోషియేట్ ప్రొఫెసర్ తో కూడిన ఓ టీమ్ నాస్తికులు, ఆస్తికులపై పరిశోధన జరిపారు. సుమారు 1500 వందల మందిని అభిప్రాయాలను సేకరించారు. అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాస్తికులకు సామాజిక మద్ధతు కూడా తక్కువగా ఉంటుందని తెలిసింది. ఒత్తిడిని అధికమించేందుకు సలహాలు ఇచ్చేవారు వారికి తక్కువగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. అనారోగ్యానికి గురిచేసే అలవాట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది. ఇద్దరి మతపరమైన విషయాలు, వివాహ సంబంధాలు, రోజు వారి కార్యక్రమాలు, అలావాట్లు, అభిరుచులు లాంటి వివిధ అంశాలపై పరిశోధలు చేశారు. ఈవిషయాలను “సోషియల్ సైకాలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్” లో పబ్లిష్ చేశారు.