రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం

రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం

ఏపీకి మూడు రాజధానులు అని సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి భిన్నస్వరం వినిపించారు. అసెంబ్లీతో పాటు పాటు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా అమరావతిలోనే ఉంటే బెటర్ అని అన్నారు. అసెంబ్లీ, పరిపాలన ఒకే చోట ఉంటేనే మంచిదని, విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని ఆయన కోరారు.

అయితే కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని, మూడు రాజధానుల అంశంపై మాత్రం తాను సీఎం జగన్‌ని కలిసి మాట్లాడతానని అన్నారు. అయితే రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఒక్కటే మండిపడుతున్నాయన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతున్నాయి. అయితే రాజధానిపై టీడీపీలోనే కాదు వైసీపీ నేతలలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండడం విశేషం.