తగ్గిన పెట్రోల్ ధరలు

తగ్గిన పెట్రోల్ ధరలు

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. డీజిల్ రేట్లు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి. పెట్రోల్ ధర ఇప్పటికే రూ.110కు సమీపంలో ఉంది. ఇక డీజిల్ రేటు అయితే సెంచరీ కొట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో వాహనదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్ ధరపై ట్యాక్స్ తగ్గించేసింది. రూ.3 కోత విధించింది. దీంతో పెట్రోలో రేటు లీటరుకు రూ.3 దిగిరానుంది. వాహనదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల తమిళనాడు ప్రభుత్వంపై ఏడాదికి రూ.1160 కోట్ల భారం పడనుంది.

అయినా కూడా తమిళనాడు పెట్రోల్‌పై ట్యాక్స్ తగ్గించింది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పెట్రోల్ ధర తగ్గడంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఒత్తిడి నెలకొనే అవకాశముంది. బీజేపీ పాలిత రాష్ట్రాలపైన అంటే పరోక్షంగా మోదీపై కూడా పెట్రోల్ ధర తగ్గింపు అంశం ప్రభావం చూపొచ్చని చెప్పుకోవచ్చు.

తమిళనాడులో ఇంధన రేట్లు తగ్గడం వల్ల ఇతర రాష్ట్రాల ప్రజలు మరీముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెట్రోల్ ధరల తగ్గింపు ఆశించొచ్చు. దీంతో జగన్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. రేట్లను అలాగే కొనసాగిస్తాయా? లేదంటే తమిళనాడు బాటలో ట్యాక్స్ తగ్గింపుతో ప్రజలకు ఊరట కలిగిస్తాయో? చూడాలి.