మరోసారి భగ్గుమన్న పెట్రోలు ధరలు

మరోసారి భగ్గుమన్న పెట్రోలు ధరలు

పెట్రోలు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఒక్క రోజుగ గ్యాప్‌ ఇచ్చి మరోసారి పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై రూ. 35 పైసలుచ డీజిల్‌పై 23 పైసల వంతున ధర పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ104.20; డీజిల్‌ రూ.97.64 పైసలకు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో కూడా లీటరు పెట్రోలు ధర రూ. 100ను దాటింది.

మెట్రో సిటీల్లో లీటరు పెట్రోలు ధర వందకు చేరుకున్న చివరి నగరంగా ఢిల్లీ నిలిచింది.సోమవారం ఆయిల్‌ కంపెనీలు కేవలం పెట్రోలు ధరను మాత్రమే పెంచి డీజిల్‌ ధరలు పెంచకుండా ఉపశమనం కలిగించాయి. కానీ ఆ ఆనందం ఒక్క రోజుతోనే పోయింది. బుధవారం రోజు లీటరు పెట్రోలుపై 23 పైసల వంతున ధర పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దిశగా వడివడిగా అడుగులు డీజిల్‌ ధరలు అడుగులు వేస్తున్నాయి.